teachers day: sept-05
సర్వేపల్లి రాధాకృష్ణన్
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (Dr.
Sarvepalli Radhakrishnan) (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 17, 1975) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తానులతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.
బాల్యం విద్యాభ్యాసం
సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు[1]. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. 1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు.
ఉద్యోగం
21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్ గా నియమించింది. ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్లు కోరారు. దాంతో ఆయన కలకత్తా వెళ్ళాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన 'భారతీయ తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది. 1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.
1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు.
1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ
పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగస్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.
1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.
డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.
1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతి అయిన తరువాత కొందరు శిష్యులు మరియు మిత్రులు, పుట్టిన రోజు జరపటానికి అతనివద్దకు వచ్చినప్పుడు, "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను", అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారు. అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.[2]
ఈయన పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించారు. అతని దృష్టిలో తత్వము అనేది జీవితాన్ని అర్ధంచేసుకోవటానికి ఒక మార్గము, భారతీయ తత్వమును అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. [3]
చేపట్టిన పదవులు
- మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను అలంకరించారు.
- 1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసారు.
- 1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్ను నియమించారు.
- 1926 జూన్లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు.
- 1929లో ఆక్స్ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు ఆయనను ఆహ్వానించారు. దీనివలన ఆక్స్ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు "తులనాత్మక మతము" (Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసము ఇవ్వగలిగే అవకాశము వచ్చింది.
- 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసారు.
- 1936లో, స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్ఫర్డు విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు.
- 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసారు.
- 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసారు.
- 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు.
- 1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.
- 1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు.
- 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు.
- 1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
గౌరవములు
- ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
- 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది.
- 1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.
- 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం (Peace Prize of the German Book Trade) పొందారు.
- 1963 జూన్ 12న బకింగ్హామ్ ప్యాలెస్లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
- ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరేటులు సంపాదించారు.
- ఆక్స్ఫర్డు విశ్వవిద్యాలయము సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్షిప్ను ప్రకటించింది.
రచనలు
- The Ethics of the Vedanta and Its Material Presupposition (వేదాంతాలలోని నియమాలు మరియు వాటి ఉపయోగము ఒక తలంపు) (1908) - ఎం.ఏ. పరిశోధనా వ్యాసం.
- The Philosophy of Rabindranath Tagore (రవీంద్రుని తత్వము) (1918).
- The Reign of Religion in Contemporary Philosophy (సమకాలీన తత్వముపై మతము యొక్క ఏలుబడి) (1920).
- Indian Philosophy (భారతీయ తత్వము) (2 సంపుటాలు) (1923 మరియు 1927).
- The Hindu View of Life (హిందూ జీవిత ధృక్కోణము) (1926).
- The Religion We Need (మనకు కావలిసిన మతము) (1928).
- Kalki or The Future of Civilisation (కల్కి లేదా నాగరికత యొక్క భవిష్యత్తు) (1929).
- An Idealist View of Life (ఆదర్శవాది యొక్క జీవిత ధృక్కోణము) (1932).
- East and West in Religion (ప్రాక్ పశ్చిమాలలో మతము) (1933).
- Freedom and Culture (స్వాతంత్ర్యం మరియు సంస్కృతి) (1936).
- The Heart of Hindusthan (భారతీయ హృదయము) (1936).
- My Search for Truth (Autobiography) (నా సత్యశోధన (ఆత్మకథ)) (1937).
- Gautama, The Buddha (గౌతమ బుద్ధుడు) (1938).
- Eastern Religions and Western Thought (తూర్పు మతాలు మరియు పాశ్చాత్య చింతన) (1939, రెండవ కూర్పు 1969).
- Mahatma Gandhi (మహాత్మా గాంధీ) (1939).
- India and China (భారత దేశము మరియు చైనా) (1944).
- Education, Politics and War (విద్య, రాజకీయం మరియు యుద్ధము) (1944).
- Is this Peace (ఇది శాంతేనా) (1945).
- The Religion and Society (మతము మరియు సంఘము) (1947).
- The Bhagwadgita (భగవధ్గీత) (1948).
- Great Indians (భారతీయ మహానీయులు) (1949).
- East and West: Some Reflections (తూర్పు మరియు పడమర: కొన్ని చింతనలు) (1955).
- Religion in a Changing World (మారుతున్న ప్రపంచంలో మతము) (1967).
జీవిత విశేషాలు
- రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5న చెన్నై దగ్గరి తిరుత్తణి అనే వూరిలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. వీళ్లది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారిగా చేయమన్నారు. కానీ రాధాకృష్ణన్కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటినుంచీ ఈయన చదువంతా ఉపకారవేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
- మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. ఆయన పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. ఆయన రోజులో 12 గంటలపాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్ఛాన్స్లర్) గా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు.
- ఆయన రాసిన 'ఇండియన్ ఫిలాసఫీ' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్'లో సభ్యుడిగా ఉండి మన విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు రాధాకృష్ణన్.
- 1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడూ ఆడంబరాలకు పోలేదు.
- రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు.
- రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఆయన మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట.
- రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని ఆయన కోరారట. ఆరోజు నుంచే ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
రాధాకృష్ణన్ తత్వవేత్త. చాలా సౌమ్యుడు. రాజకీయాలు, దౌత్యవ్యవహారాలతో ఆయనకు అంతగా పరిచయం లేదు. స్టాలిన్ ను చూద్దామా అతి క్రూరుడని, అతని తత్వానికి రాధాకృష్ణన్ కు ఏమాత్రం పడదని అందరూ అన్నారు. రాయబారిగా రష్యా వచ్చిన రాధాకృష్ణన్ రోజుకు పద్దెనిమిది గంటలు పుస్తకాలు చదవటం, వ్రాయటంలో గడుపుతుంటాడని విన్నాడు స్టాలిన్.
ఆహ్వానం అందుకున్న డా. రాధాకృష్ణన్ రాయబార కార్యాలయోద్యోగి రాజేశ్వర్ దయాళ్ తో పాటు స్టాలిన్ వున్న గదిలో ప్రవేశించారు. రష్యా విదేశాంగమంత్రి విటాన్స్కీ స్టాలిన్ ప్రక్కనే ఉన్నారు. పావ్లోవ్ దుబాసిగా ఉన్నాడు. ఆ సమావేశాన్ని వివరిస్తూ రాధాకృష్ణన్ ఇలా వ్రాశారు.
"మా సంభాషణలో అశోక చక్రవర్తి ప్రస్తావన వచ్చింది. ఆయన పెక్కు యుద్ధాలు చేశాడని, వేలాది ప్రజలను చంపి యుద్ధంలో విజయం సాధించాడని, చివరకు ఆ మహారాజు సన్యాసిగా మారిపోయాడు అంటూ కళింగ యుద్ధం గురించి చెప్పాను. అశోకుని పరిస్థితి మీకూ కలగవచ్చు అన్నాను. అందుకు స్టాలిన్, 'అవును అద్భుత సంఘటనలు సంభవిస్తాయి' అన్నాడు. సమావేశం చివర నేను స్టాలిన్ చెక్కిళ్ళను నిమిరి వీపుపై తట్టాను. ఆయన తలపై నా చేతిని ఆడించాను. అప్పుడు స్టాలిన్
"అయ్యా, నన్ను రాక్షసునిగాకాక, మనిషిగా గుర్తించిన వారు మీరొక్కరే. మీరు త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళుతున్నట్లు విన్నాను. అందుకు విచారిస్తున్నాను. నేను ఇక ఎంతోకాలం బ్రతకను." అన్నాడు. తర్వాత ఆరు నెలలకే చనిపోయాడు స్టాలిన్.
గాంధీజీ హత్యకు గురి అయ్యే కొద్ది రోజులముందు రాధాకృష్ణన్ గాంధీజీని కలుసుకున్నారు. తాను రచించిన 'భగవద్గీత' ఆంగ్లానువాదాన్ని గాంధీకి అంకితం చేయదలచినట్లు చెప్పారు రాధాకృష్ణన్. అందుకు గాంధీజీ సమాధానమిస్తూ "మీ రచనలు చాలా గొప్పవి. కానీ నా అభిప్రాయం వినండి. నేను, మీ అర్జునుణ్ణి. మీరు నా కృష్ణభగవాన్ " అన్నాడు గాంధీజీ. ఇలా మహాత్ముని మన్ననలందుకున్న మహాపండితుడు, రాధాకృష్ణన్.
జననం - విద్యాభ్యాసం
శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు 40 మైళ్ళ దూరంలోని తిరుత్తణి లో జన్మించారు. తండ్రి వీరాస్వామయ్య. ఒక జమీందారీలో తహసిల్దార్. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. విద్యార్ధిగా వున్నపుడు, మనస్తత్వశాస్త్రంపై చేసిన ఉపన్యాసాలు అందరినీ అలరించేవి.
21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్ గా నియమించింది. ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్లు కోరారు. కలకత్తా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు రాధాకృష్ణన్. ఆయన ఇంటిముందు గుర్రపుబండి సిద్ధంగా ఉంది. తమ అధ్యాపకునికి వీడ్కోలు చెప్పటానికై విద్యార్థులు ఆయన ఇంటికి వచ్చారు. బండికి కట్టిన గుర్రాలను వదిలించారు. రైల్వే స్టేషన్ దాకా బండిని తామే లాక్కొని వెళ్ళారు. అది విద్యార్ధులకు ఆయన పట్ల వున్న ప్రేమకు సంకేతం. విద్యార్ధుల భక్తిశ్రద్ధలను గమనించిన రాధాకృష్ణన్ కళ్ళు చెమ్మగిల్లాయి. అది గురుశిష్యుల హృదయానుబంధం. ఆ ప్రేమానుబంధం ఈనాడు అంతగా కానరాదు.
కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన 'భారతీయ తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది.
"మీరు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ తీసుకుని వుంటే మీకు మరింత గొప్ప పేరు వచ్చేది" అన్నాడొక మిత్రుడు. అందుకు బదులుగా, డా. రాధాకృష్ణన్ "నేను ఆక్స్ఫర్డ్ వెళ్తే, అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తాను. కాని విద్యార్ధిగా మాత్రం వెళ్ళను" అన్నాడు. అలా అన్న ఆరేళ్ళ తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వారి ఆహ్వానంపై, ప్రాచ్య తత్వశాస్త్రంపై ఉపన్యాసాలిచ్చేందుకు వెళ్ళారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికాలలో పలుచోట్ల ఉపన్యాసములిచ్చి మాతృదేశం వచ్చారు.
1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.
1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు.
1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగష్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.
1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.
డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.
రచనలు
ముఖ్యమైన ఉపనిషత్తులు, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్-రెఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫేత్, ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫి, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ వంటి చాలా గొప్ప గ్రంథాలు రచించినారు.
1962లో బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి పదవి నుండి విరమించుకున్నారు. వారి తర్వాత రాష్ట్రపతిగా ఉన్న డా. రాధాకృష్ణన్ అయిదేళ్ళ కాలంలో ఎన్నో దేశాల్లో పర్యటించారు. అసమాన వాగ్ధాటితో, ప్రాచ్య పాశ్చాత్వ తత్వశాస్త్రాలపై చేసిన ఉపన్యాసాలు అన్ని దేశాల వారిని ఆశ్చర్యపరిచాయి.
ఛలోక్తులు
ఆయన ఉపన్యాసాల్లో ఛలోక్తులు, హాస్యోక్తులు దొర్లేవి. ఒకసారి సర్. మహమద్ ఉస్మాన్ (ఒకప్పుడు మద్రాసు రాష్ట్రమంత్రి) డా.రాధాకృష్ణన్ ఒకే సభలో మాట్లాడారు. సర్ మహమద్ ఉస్మాన్ను గురించి మాట్లాడుతూ, "శ్రీ ఉస్మాన్ నాకు చాలా సన్నిహిత మిత్రుడు. ఆయన కాలేజీలో మొదట సీనియర్. ఆ తర్వాత నా క్లాస్మేట్. తర్వాత నా జూనియర్. నేను మద్రాసులో ప్రొఫెసర్గా వున్నప్పుడు ఆయన అదే యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్. నేను వైస్ ఛాన్స్లర్గా వుండినపుడు ఆయన ఛాన్స్లర్."
రాధాకృష్ణన్, మానవజీవితంలో మంచిని పెంచాలనీ, ఉత్తమ సమాజాన్ని రూపొందించాలని, మతాన్ని సరిగా అర్థం చేసుకోవాలని బోధించారు. మానవుల్లోని మమతానురాగాలను పెంచుటకు ప్రపంచం కృషి చేయాలన్నారు. అహింసా విధానం ద్వారా ప్రపంచ దేశాలన్నీ శాంతిని పెంచాలన్నారు.
ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు వారిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం వారిని 'భారతరత్న' తో సత్కరించింది. 1975లో 'టెంపుల్ టన్' బహుమతి ద్వారా లభించిన 96 వేల డాలర్ల మొత్తాన్ని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ సంస్కృతిపై ప్రసంగాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. రాధాకృష్ణన్ గారు, డా. కె. యం మున్షీగారితో కలిసి భారతీయ విద్యాభవన్ స్థాపించారు.
మహామేధావిగా, గొప్పవ్యక్తిగా, గొప్ప గ్రంథకర్తగా, తత్వవేత్తగా, ప్రపంచ దేశాల మన్ననలందుకున్న డా. రాధాకృష్ణన్ భారతీయ మహర్షులకోవకు చెందిన వారు.
రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత (1967) చివరిరోజు వరకు మద్రాసులోని తమ భవనంలో, తాత్విక చింతన చేస్తూ 17.4.1975న పరమపదించారు.
ఆచార్యునిగా ఆయనను గుర్తించిన భారత దేశం, రాధాకృష్ణన్ జన్మదినమును ఉపాధ్యాయదినంగా దేశమంతటా ఏటా జరుపుకోవడం ఎంతో సముచితం.
తన
జీవిత కాలం మొత్తం శ్రీ
రాధాకృష్ణన్ ని ఉన్నత పదవులు
ఒకదాని వెంట ఒకటి వరించాయి.
పదవులకు ఆయన వన్నె తెచ్చి
సమర్ధవంతంగా నిర్వహించారు. తత్వ శాస్త్రంలో అధ్యాపకునిగా,
మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తత్వ శాస్త్రంలో అసిస్టెంట్
ప్రొఫెసర్ గా, మైసూర్ విశ్వ
విద్యాలయంలో తత్వ శాస్త్రంలో ప్రొఫెసర్
గా , ఇదే పదవి తిరిగి
ఆంధ్ర విశ్వ విద్యాలయం తూర్పు
దేశమతాలు, నీతులు అనే భాగానికి ప్రొఫెసర్
గా పని చేసి, బనారస్
విశ్వ విద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా
(1942)లో పని చేశారు. శ్రీ
రాధాకృష్ణన్ చేపట్టిన ఇతర ఉన్నత పదవులు
యునెస్కో సమావేశాలకు భారతీయ విద్యా కమీషన్ (1948) కు నాయకత్వం, యునెస్కో
కార్యనిర్వాహక కమిటి ఛైర్మన్ (1948), యునెస్కో
అధ్యక్షులు (1952) గా వివిధ పదవులు
వారు నిర్వహించారు. ఆధునిక యుగంలో రచయితలలో డా।। రాధాకృష్ణన్
అగ్రగణ్యులు. తత్వ శాస్త్రం, నీతి
శాస్త్రం, విద్యా సామాజిక సాంస్కృతిక రంగాలలో పలు విషయాలపై తన
రచనలు గావించారు. వీరి రచనల్లో ప్రముఖమైనవి...
ఫిలాసఫి ఆఫ్ లైఫ్ (1932) ఈస్టర్న్
రిలీజియన్ అండ్ వెస్టర్న్ ధాట్,
ఇండియన్ ఫిలాసఫి (రెండు భాగాలు) మొ।। ఉన్నాయి.
ప్రపంచంలోని తత్వ శాస్త్ర వేత్తల్లో
డా।। రాధాకృష్ణన్
ప్రముఖంగా నిలిచారు. ప్రంచ ప్రఖ్యాత తత్వవేత్తలు
సభ్యులుగా ఉన్న లైబ్రరీ ఆఫ్
లీవింగ్ ఫీలాసఫర్స్ 1952లో ఆయనపై ది
ఫిలాసఫీ ఆఫ్ రాధాకృష్ణన్ అనే
గ్రంధం వెలువరించినది. ఈ గ్రంధంలో డా।। రాధాకృష్ణన్
తాత్విక ఉపన్యాసాలు ఆయన వివరణాత్మక వ్యాసాలు
ప్రచురితమయ్యాయి. ప్రపంచంలోని విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో
సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం
వారిని భారత రత్న తో
గౌరవించింది. 1975 లో టెంపుల్ టన్
బహుమతి ద్వారా లభించిల 96 వేల డాలర్ల మొత్తాన్ని
ఆక్స్ ఫర్ఢ్ విశ్వ నిద్యాలయంలో
భారతీయ సంస్కృతి పై ప్రయోగాలు ఏర్పాటు
చేసేందుకు విరాళంగా ఇచ్చారు. రాధాకృష్ణన్ గారు డా।।
కె. యం. మూన్షీ గారితో
కల్సి భారతీయ విద్యాభవన్ స్ధాపించారు. మహా మేధావిగా గొప్ప
వ్యక్తిగా గొప్ప గ్రంధ కర్తగా,
తత్వ వేత్తగా ప్రపంచ దేశాల మన్నన లందుకొన్న
డా।। రాధాకృష్ణన్
1967లో రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన
తరువాత చివరి రోజు వరకు
మద్రాసులోని తమ నివాసంలో తాత్విక
చింతన చేస్తూ 17 -4- 1975న పరమ పదించారు.
స్వతంత్ర భారత దేశ మొదటి
ఉపరాష్ట్ర పతిగా పదేళ్లు, రాష్ట్రపతిగా
ఐదేళ్లు డా।। రాధాకృష్ణన్
పని చేసి దేశ ప్రజల
గౌరవ మన్ననలేగాక, యావత్ప్రపంచపు మేధావులందరి ప్రశంసలు కూడా పొందారు. తన
అఖండ మేధస్సుతో భారత దేశం లోనే
కాదు ప్రపంచ మంతటినిలోనే ఆరు దశాబ్దాల పాటు
మణి దీపంగా వెలిగిన మహా మనీషి డా।। సర్వేపల్లి
రాధాకృష్ణన్ . వక్తృత్వ సౌరభ సౌర్య విషయంలో
ఆయన మల్లె పువ్వుతో పోల్చదగినవారు.
ఆచార్యునిగా ఆయనను గుర్తించిన భారత
దేశం , రాధా కృష్ణన్ జన్మ
దినమును ఉపాధ్యాయ దినంగా ప్రతి ఏటా జరుపుకుంటు
న్నారు.
ఉత్తమ ఉపాధ్యాయుడు
పట్టభద్రుడైన
రాధాకృష్ణున్ ప్రతిభను గుర్తించి మద్రాసు ప్రెసిడెన్సి కళాశాల సహ ఆచార్యునిగా నియమించింది.
బక్కపలుచగా, విశాల ఫాలభాగం, కొసదేరిన
ముక్కు, తెల్లని తలపాగ, పొడవైన పసుపు పచ్చని కోటు,
చురుకుదనానికి, కుశాగ్రబుద్ధికి ప్రతిరూపంగా ఉండేవారు రాధాకృష్ణన్.
ఆచార్యుడుగా
పనిచేస్తూనే హిందూ వైదిక, ఆధ్యాత్మిక,
సాంస్కృతిక, సామాజిక, సాహిత్యా న్నంతా ఔపోశన పట్టేశారు. విదేశీ
తత్వవేత్తలైన ప్లేటో, ప్లోటినస్, కెంట్, బ్రోడ్లీ, బెర్గ్సన్, షేక్స్పియర్, వర్డ్స్వర్త్, అల్నోల్డ్ తదితరుల గ్రంథాలను చదివాడు. తన రచనలలో వారి
మాటలను సందర్భానుసారంగా ఉల్లేఖించేవారు.
భారతీయ
తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టి, ప్రపంచ తాత్వికులకు హైందవ తత్వాన్ని అందించే
వారధిగా సఫలురయ్యారు రాధాకృష్ణన్.
”ఎథిక్స్
ఆఫ్ ది వేదాంత” అనే
విమర్శనకుగాను 1911లో ఎమ్.ఏ.పట్టా వచ్చింది. ప్రపంచంలోని
మతతత్వవాదులకు భారతీయ శ్రేష్ఠత్వాన్ని స్పష్టం చేసి అవగాహన కల్గించారు
రాధాకృష్ణన్.
”విజ్ఞానశాస్త్ర
పరిశోధనల ఫలితంగా అనేక రకాల మారణాయుధాలు
తయారుచేసుకున్న మానవ జాతిని వినాశనం
నుండి రక్షించే శక్తి ఏది? మత
విశ్వాసము, శాంతి కాముకత్వము, భగవద్భక్తి,
ఆధ్యాత్మిక శక్తి మాత్రమే మానవున్ని
పతనం నుండి, మృత్యువు నుండి కాపాడగలదు. కావున
ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తిని సాధించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ మతధర్మాలను సాటి మానవులకు చెప్పి
బోధించుట భారతీయుల కనీస ధర్మం” అని
కర్తవ్య బోధ చేశారు రాధాకృష్ణన్.
సమరసతా పథం
డాక్టర్
ఆశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ల కోరిక మేరకు
కలకత్తా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం బోధించారు. మైసూర్ విశ్వవిద్యా లయంలో ప్రొఫెసర్గా
పనిచేశారు. ‘భారతీయ తత్వశాస్త్రం’ అనే గ్రంథాన్ని కలకత్తాలో
ఉన్నప్పుడే రాశారు. 1931లో ఆంధ్ర విశ్వవిద్యాలయం
వైస్ ఛాన్సలర్‌గా ఉన్నప్పుడు విశ్వవిద్యాలయ
అభివృద్ధితో పాటు, సమరసత, సమైక్యత,
సాంఘిక సంస్కరణలకు విద్యాలయాన్ని వేదికగా మార్చారు. ఆర్ట్స్, సైన్స్ శాఖలలో విద్యార్థులకు హాస్టలు వసతి ప్రారంభిం చారు.
మొదట్లో కులాలవారిగా ప్రత్యేక భోజన సదుపాయాలు ఉండేవి.
దీనిని మార్చివేసి అందరికి అన్ని కులాలవారికీ ఒకేచోటు
భోజన పద్ధతిని మొదలు పెట్టించారు. అప్పటి
నుండి హాస్టలులో సహపంక్తి భోజన విధానం అమలులోకి
వచ్చింది.
అవి
దేశ స్వాతంత్య్రోద్యమ రోజులు. ఆంగ్లేయు లకు వ్యతిరేకంగా పోరాడటంలో
విశ్వవిద్యాలయాలు ప్రధాన పాత్రను పోషించేవి. ఈ సున్నిత సమయంలో
నేతృత్వం వహించడం కత్తిమీద సామే. కాని తన
చతురతతో ఆంగ్లేయులకు, దేశభక్తులకు చక్కని సమన్వయాన్ని సాధిస్తూ విశ్వవిద్యాలయాల్లో విద్యను, దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని
కుంటుపడకుండా చూశారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
ఆత్మీయ రాయబారి
భారతదేశానికి
స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1949లో రాధాకృష్ణన్ మాస్కోలో
భారత రాయబారిగా పనిచేశారు.తన ఉదాత్త ఉన్నత
భావాలతో సమన్వయ శక్తితో, సమస్య పరిష్కార ప్రజ్ఞతో
రష్యావారి హృదయాలను చూరగొన్నారు. భారత్ రష్యాల స్నేహ బంధం బలపడేట్లు
చేశారు.
ఒకరోజు
రాధాకృష్ణున్ తన మిత్రులతో టీ
తాగుతుండగా ఫోన్ మోగింది. స్టాలిన్
మిమ్ములను కలవాలనుకుంటున్నారు అని సమాచారం. స్టాలిన్
రాధాకృష్ణున్ అలవాట్లను తెలుసుకొని సాధారణంగా అర్ధరాత్రి ఏర్పాటుచేసే సమావేశాన్ని రాత్రి 9 గంటలకే ఏర్పాటు చేశారు. సమావేశానంతరం స్టాలిన్ ”రాధాకృష్ణున్ సామాన్య దేశభక్తుడు కాదు. మానవుల వేదనకు
ఆయన హృదయం ఎప్పుడూ స్పందిస్తుంది.
అంతటి మెత్తని మనసాయనది” ఇలా రజోగుణ, రక్తపిపాస,
సామ్రాజ్యవాది నోట మానవ తను
మేల్కొల్పారు రాధాకృష్ణన్. అంతేకాదు, 1952లో రష్యా నుండి
తిరిగి వచ్చే సమయంలో ఏర్పాటు
చేసిన సమావేశం విశేషాలను రాధాకృష్ణన్ ”స్టాలిన్ ముఖం అప్పుడు కొంత
పొంగి ఉంది. ఆయన వీపును
తట్టాను, తలను చేతితో నిమిరి
ధైర్యం చెప్పాను. అయినా స్టాలిన్ బాధపడుతూ
‘నన్ను మానవునిగా ఆదరించిన వారు ఇంతవరకు మీరు
ఒక్కరే. నన్నందరు క్రూర జంతువువలె చూస్తారు.
మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. నేను ఈ విషాదం
మధ్యే మిగిలిపోతున్నాను. మీరు చిరకాలం సుఖంగా
జీవించండి. నేను మాత్రం ఇంకెంతో
కాలం ఉండను’ అని తన మనసులోని
బాధను చెప్పారు. తరువాత ఆరు నెలలలో స్టాలిన్
చనిపోయారు” అని రాధాకృష్ణన్ అన్నారు.
తత్వశాస్త్రం- భారత రాష్ట్రపతి
”మార్కన్
అరేబియన్” తత్వవేత్త అయి, రాజు అయ్యాడు.
అలాగే వేదాంతి, రాజాధికారి అయిన మొదటి భారతదేశ
పాలకుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతదేశానికి రాధాకృష్ణన్ రాష్ట్రపతి (అధ్యక్షుడు) కావడంతో తత్వశాస్త్రం గౌరవాన్ని పొందిందని అమెరికా యూరప్ ఖండాల తత్త్వజ్ఞు లలో
ఒకరైన బెర్ట్రాండ్ రస్సెల్ అన్నారు.
భారత
రాష్ట్రపతిగా తన మొదటి ఉపన్యాసంలో
”సత్యమేవ జయతే” (సత్యమే గెలుస్తుంది), ”తదేక ఈశ్వర పూజానామ్”
(అదే ఈశ్వర పూజ) ఇలా
అన్ని పనులు పరమేశ్వరార్పణంగా చేయాలని
బోధించడం రాధాకృష్ణ పరిపూర్ణత్వానికి నిదర్శనం.
1962 సెప్టెంబర్
5న భారత రాష్ట్రపతి రాధాకృష్ణన్
75వ జన్మదిన వేడుకలను దేశమంతటా నిర్వహించారు. ప్రపంచ తత్వవేత్తల అభినందనలు, అభినందన పత్రాలు, దేశంలోని ప్రముఖుల వ్యాసాలతో మదరాసువారు ”ది రాధాకృష్ణన్ నంబర్”
అనే అభినందన సంచికనే ప్రచురించారు.
డాక్టర్
సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసిద్ధి పరాన్ముఖు లనడానికి ఆయన శిష్యులు మిత్రులతో
చేసిన, సంభాషణే నిదర్శనం. ”నా పుట్టిన రోజును
వేరుగా జరిపే బదులు, దానిని
ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేనెంతో గర్విస్తాను” అని చెప్పి ఉపాధ్యాయ
వృత్తి పట్ల తన ప్రేమను,
భక్తిని చాటారు. నాటి నుండి వారి
జన్మదినాన్ని ”ఉపాధ్యాయ దినోత్సవంగా” దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం.
డాక్టర్
సర్వేపల్లి రాధాకృష్ణన్ దృష్టిలో తత్వం అనేది జీవితాన్ని
అర్థం చేసుకోవడానికి ఒక మార్గం. భారతీయ
తత్వం అర్థం చేసుకోవడమనేది ఒక
సాంస్కృతిక చికిత్సగా భావించేవారు. ఇలా రాధా కృష్ణన్
జీవితాన్ని విద్యాబోధన పట్ల వారి నిబద్ధతను
అర్థం చేసుకొని ఆ మేరు నఘధీరుడిని
అనుస రించడమే నేటి ఉపాధ్యాయుల కర్తవ్యం.
డాక్టర్ సర్వేపల్లి గారి రచనలు:
డాక్టర్ సర్వేపల్లి గారి రచనలలో కొన్ని ముఖ్య మైనవి:
డాక్టర్ సర్వేపల్లి గారి రచనలలో కొన్ని ముఖ్య మైనవి:
- " ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ " (1926);
- " ఇండియన్ ఫిలాసఫీ " (సంపుటి 1, 2);
- " ది రెలిజియన్ వీ నీడ్ ";
- "ది ఫ్యూచర్ ఆఫ్ సివిలైజేషన్ ";
- " ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ " (1932);
- "ది హార్ట్ ఆఫ్ హిందుస్తాన్ " (1936);
- "ఈస్టన్ రిలిజన్స్ అండ్ వెస్టర్న్ థాట్స్ " (1939);
- " గ్రేట్ ఇండియన్స్ " (1949);
- " ఫెల్లోషిప్ ఆఫ్ ఫైత్స్ ",
- హార్వర్డ్ ఉపన్యాశాలు (1961);
- " ది క్రియేటివ్ లైఫ్ " (1975);
- " లివింగ్ విత్ ఏ పర్పస్ ";
- " ట్రూ నాలెడ్జ్ " ఉన్నాయి.
1967 లో మరొక కాల పరిమితి
రాష్ట్రపతిగా
ఉండటానికి
సుముఖం చూపించక,
మద్రాసు
తిరిగి వెళ్ళిపోయారు.
1961 లో జర్మనీ లో " శాంతి
" బహుమతి అందుకున్నారు.
1975 లో " టెంపెల్
టన్
" బహుమతి అందుకున్నారు.
వచ్చిన మూల్యాన్ని
ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి
విరాళంగా
ఇచ్చేశారు.
1989 నుండి వీరి స్మృత్యర్ధం
" రాధాకృష్ణ చెవినింగ్ "
స్కాలర్షిప్స్
అందజేస్తున్నారు.
ఆయన ఏప్రిల్
17, 1975 లో మరణించారు.
ఓ సందర్భంలో మిత్రులు ఆయన పుట్టినరోజు సంభరం జరుపుతామని ప్రస్తావించినప్పుడు డాక్టర్ సర్వేపల్లి ఇలా స్పందించారు - " నా పుట్టిన రోజు జరిపే బదులు, సెప్టంబర్ 5 (ఆయన పుట్టిన రోజు) " టీచర్స్ డే " (అధ్యాపకుల దినోత్సవం గా) జరపండి అన్నారు. అదే నిజమైంది.
నేటికి ఆయన పుట్టినరోజున అధయాపకులను స్మరిస్తూ, సెప్టంబర్ 5, అధ్యాపకుల దినోత్సవంగా పాటిస్తున్నారు. ప్రతీ యేటా, భారత దేశంలోని విశిష్ఠ అధ్యాపకులను గుర్తించి గౌరవిస్తున్నారు. ఇలా గౌరవించినన్నాళ్లు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన హృదయాలలో ఆదర్శవంతుడిగా నిలచిపోతారు.
ఓ సందర్భంలో మిత్రులు ఆయన పుట్టినరోజు సంభరం జరుపుతామని ప్రస్తావించినప్పుడు డాక్టర్ సర్వేపల్లి ఇలా స్పందించారు - " నా పుట్టిన రోజు జరిపే బదులు, సెప్టంబర్ 5 (ఆయన పుట్టిన రోజు) " టీచర్స్ డే " (అధ్యాపకుల దినోత్సవం గా) జరపండి అన్నారు. అదే నిజమైంది.
నేటికి ఆయన పుట్టినరోజున అధయాపకులను స్మరిస్తూ, సెప్టంబర్ 5, అధ్యాపకుల దినోత్సవంగా పాటిస్తున్నారు. ప్రతీ యేటా, భారత దేశంలోని విశిష్ఠ అధ్యాపకులను గుర్తించి గౌరవిస్తున్నారు. ఇలా గౌరవించినన్నాళ్లు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన హృదయాలలో ఆదర్శవంతుడిగా నిలచిపోతారు.

No comments:
Post a Comment